జీవితము దాని పరిణామాలు, బాద్యతలు, సమయాలు రకరకాల వత్తిడులమద్య సాహిత్య సమయం గడపటం కొంచెం కష్టమైపోతుంది.
గత ముప్పై యేళ్ళుగా ఎందరికో స్పూర్తినిచ్చి ముందుకు నడిపించిన శ్రీ సి.వి. కృష్ణారావు గారు వయస్సు మీదపడుతున్నా, అనారోగ్యం వెంటాడుతున్నా నెల నెలా వెన్నెల ను ప్రారంభించినప్పటి ఉత్సాహాన్ని కనపరస్తూ నడిపిస్తున్నారు.
ఈ నెల సమావేశానికి వచ్చిన వారు
ధర్మాచారి
కె.వి. రామానాయుడు
యాకూబ్
రఘు (ఖమ్మం)
జాన్ హైడ్ కనుమూరి
రఘు - ఖమ్మం వాస్తవ్యులు, ఇటీవల హైదరాబాదు మారటంతో నెలనెలా వెన్నెలకు మొదటిసారిగా వచ్చారు.
ఈ నాటి సమయాన్ని ఆయన కవిత్వంతో నింపారు
ధర్మాచారి - తనదైన శైలిలో గల్పికలు చదివి వినిపించారు
కె.వి. రామానాయుడు - తన కొన్ని పాత కొత్త కవితలను వినిపించారు
నేను - సమావేసమును గురించి రాసిన బ్లాగుకు స్పందించిన శ్రీ అఫ్సర్ పంపిన కవితను, ఈ మద్య నాకు నచ్చిన రాధిక రాసినా ఊరు కవితను, ఈ మద్య నేను రాసిన ఆమె - నేను- రెండు దృస్యాలు చదివి వినిపించాను.
కొన్ని ప్రక్రియలపైన, సాహిత్యంపైన తగ్గుతున్న ఆశక్తి గురించి మాట్లాడుకుని
గురువుగారిచ్చిన చల్లని పానీయాన్ని త్రాగి సెలవు తీసుకున్నాము
No comments:
Post a Comment