Thursday, June 18, 2009

నా జీవితంలో శ్రీ శ్రీ

నా జీవితంలో శ్రీ శ్రీ

ఈ మద్య శ్రీ శ్రి గురించి చదుతున్నప్పుడు నాకు ఆయనతో ఎటువంటి అనుబందం లేకపోయిందే అనిపించింది.
నా యవ్వనంలో సాహిత్యం పెద్దగా చదివిన గుర్తులేదు. అందులోనూ శ్రీ శ్రీని అసలు చదలేదు.
ఓ సాయత్రం ఆఫీసు అయిపోయి ఇంటికి వెళుతున్నప్పుడు బస్సులో మగత మగతగా కొన్ని జ్ఞాపకాలు వెంటాడాయి.ముఖ్యంగా రెండు సందర్బాలు.

1. నా 24వ ఏట పెళ్ళి సంబందాలు రావటం మొదలయ్యాయి. అప్పటికి నాకంటే పెద్దదైన అక్కకు నాకు కలిపి కుండమార్పిడి సంబందం ఒకటి. మా ఇంటిలోని వారికి చాలా వరకు నచ్చింది. కాని నేను 28 సంవస్తరాలు వచ్చేవరకు చేసుకోనని నిర్దందంగా చెప్పేసాను. అప్పటికి నేను మద్యప్రదేశ్ లోని జబల్‌పూర్ వద్ద ఓ కంపెనిలో పనిచేస్తున్నాను. అక్కడనుంచి ఒక సంవత్సరంపాటు ఇంటికి రాలేదు. అక్క పెళ్ళికోసం వచ్చినప్పుడు నా మీద ముగ్గురు మరదళ్ళ చూపు పడింది. ముగ్గురుతో కొద్దిగా చనువు ఏర్పడింది. అది ప్రెమని నేను అనుకోను కాని మా మద్య పలకరింపుల లేఖలు నడిచాయి ఒక సంవత్సరం గడిచిన తర్వాత ముగ్గిరిలో ఎవరినైనా ఎన్నుకోవాలా లేక బయటకు వెళ్ళాలా అనే సందేహం కలిగింది. ఒకరు రూపంలో బాగుండేది, ఇంకొకరు చదువులో ముందుండేది, ఇక మోడో ఆమెకు రెండిటిలోనో సాధరణమే అయినా, పొలము పుట్ర సంక్రమించేవిగా వుంది. ఇలాంటి సమయంలో శ్రీ శ్రీ నాకు తెలియకుండా నా జీవితంలోకి ప్రవేశించాడు.
అది ఎలా అంటారా?
"నిన్ను నిన్నుగా ప్రెమించుటకు
నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే బాగ్యమో! అదే స్వర్గమో!" ముగ్గురిలో ఒకరు నా ప్రక్కటెముకగా మారింది.
ఆ భాగ్యాన్ని, ఆ స్వర్గాన్ని సొంతంచేసుకున్నాక చాలా కాలం నన్ను ప్రభావితం చేసింది శ్రీ శ్రీ అని తెలియదు.

2
ఒ రోజు ఎక్కడికో ప్రయాణంచేస్తూ బస్సుకోసం ఎదురుచూస్తున్నప్పుడు ఫుట్పాత్ మీద పాత పుస్తకాలు కనిపించాయి. అందులో ఓ చిన్న పుస్తకాన్ని సైజు చూసి డిటెక్టివ్ అనుకోని అయిదు రూపాయలకు కొన్నాను. దానికి అట్టలేదు. తీరా బస్సు వచి, సీటు దొరికాక పుస్తకంలోపలికి వెళితే అది వచన కవిత్వం, అందులోనో మైకోవిస్కీ రచనకు తెలుగు అనువాదం (నిజానికి అప్పటికి మైకోవిస్కీ తెలియదు). ఆ పుస్తకం ఎంతగా నచ్చిందంటే ప్రతీ ప్రయాణంలో పట్టుకెళ్ళేవాడిని. కొన్నిరోజులు దాన్ని మర్చిపోయాను. మళ్ళీ ఓ సాహితి మిత్రుడు వద్ద ఏ పుస్తకం విషయం ప్రస్తావన వచ్చింది. అప్పుడు తెలిసింది అది మైకోవిస్కీ రచన, శ్రీ శ్రీ అనువాదం.
ఇది రాస్తున్న సమయానికి చాలా సంవస్తరాలే అయ్యింది చదివి. అందులోని పాదాలు నాకు కుర్తుకు లేవు. కానీ అది చదినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను. ఇప్పుడు అనిపిస్తుంది నేను సాహిత్యం చదవడం, మొదలుపెట్టాక రాయడంలో బహుశ దాని ప్రభావం వుందనిపిస్తుంది.
నాకు తెలియకుండానే నా జీవిత కీలక సంఘటనల్లో శ్రీ శ్రీ చొరవ తీసుకొని ఆలోచనాంతర్బాగం అయిపోయాడు. నన్ను రుణగ్రస్తుణ్ణి చేసేసాడు. ఏమిస్తే ఆయన రుణం తీరుతుంది.
శిరసు వంచి నమస్కరిస్తున్నా.

No comments: