ఈ మద్య నేను నా సహచరుణ్ణి కోల్పోయాను. నిజానికి అతను నా చుట్టుతిరుగుతున్నప్పుడు, నాతోనో వుంటున్నప్పుడు అతణ్ణి నా సహచరుడుగా గుర్తించలేకపోయాను.
ఓ రోజు హటాత్తుగా వురిపెట్టుకొని చనిపోయాడనే వార్తను సెల్లుపోను నా చెవిలోకి జారవిడిచినప్పటినుంచి, నా హృదయాన్ని కుదిపేస్తుంది.
ఈ మద్య ఎప్పుడో ఆత్మహత్యలగురించి రాద్దమని చాలా విషయాలను సేకరించాను కాని నా వ్యక్తిగతము, సమయ చిక్కబట్టుకోలేక రాయలేకపొయా. రాసివుంటే బహుశ నా సహచరుడుకి వుపయోగపడెదేమో అనే సందేహం పీడిస్తుంది.
అలోచనలతో మస్తిష్కం వేడెక్కుతోంది, ఈ లోగా అవకాశాన్ని చూసుకొని ఎటునుంచి లోనికిదూరిందో క్రిమి (వైరస్) జ్వరమై పీడిస్తుంది. ఈ జ్వరంలో పలవరింతలు, భయాలు, ఒకొక్కటిగా దాడిచేస్తున్నాయి. నా దేహాన్ని నిర్వీర్యం చేయడానికి దొరికే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది. నా సహచరుణ్ణి ఆర్థింకంగా వుచ్చులోబింగించి తనుకుతాను దూరంగా పారిపోవాలనే ఆలోచను రేకెత్తించి, బంధాలను బాద్యతలను నిర్ధాక్షణ్యంగా వదిలేసి వెళ్ళిపోయాడు. రోజూ చూపులతొనో, మాటలతోనో వేధించే తన సగభాగానికి పూర్తి బాద్యను నెట్టేసి పారిపోయాడు.
తను పారిపోయిన పిరికితనంలో నాకూ భాగస్వామ్యం వుందా?? అనే అలోచన ముల్లులా గుచ్చుకొని మరింత బాధిస్తుంది.
ఒక్కసారి లోనికి ప్రవేసించి రక్తంలొకి చొరబడ్డ వైరస్ను చంపడానికి చేస్తున్న ప్రయత్నాలలొ దేహం తూట్లు పదుతుంది.
దేహానికి కొత్తగాయమో, అంగచ్చేదనమో అవసరమౌతున్నాయి.
వైద్యంకోసంచేస్తున్న ప్రయత్నలూ నా దేహాన్ని బాదిస్తూనే వున్నాయి.
అయినా రేపటి ఉదయంకోసం నిరీక్షన, ఆసై ఎదురుచూస్తుంది.
ఏ జాములోనో కప్పిన మంచుపొరను చీల్చడానికి వేకువకిరణం ఆరాటపడుతునేవుంది.
నా సహచరురుణ్ణి గుర్తించడమే కష్టమౌతుంది. మనసుపొరల్లోచి మేలుకొన్న మానవత్వమై నీకోసం ఎదురుచూస్తాను.
ఛేదు జ్ఞాపకాన్ని ఇచ్చిపోయావు, మరెవరికీ ఈ రుచిని చూడొద్దని ఎలుగెత్తి చెప్తాను.
3 comments:
మామూలు గాయం కాదు మీది. అనుభవించేవాడికే తెలుస్తుంది ఆ బాధ!
బాధ వర్ణనాతీతం అంటారు కానీ ,
పిండే గుండెల బాధని, మనసులో మండే గాధని
మాటల్లో చాలా బాగా వ్యక్త పరిచారు.
నా గాయమే ఇంతబాదగావుంటే దేశానికి పడ్డగాయం ఎంతబాదాకరమో కదా!
Post a Comment