మా కంపెనికీ గతవారంలో విదేశీ అథిదులు మూడు ధఫాలుగా వచ్చారు. వారిని తోడ్కనిరావటానికి విమానాశ్రయానికి నేను వెళ్ళటం జరిగింది. నాతోపాటు ఒక విదేశీ అథిది కూడా వున్నారు. మాకు కలిగిన రెండు అనుభవాలు మీ ముందుంచాలని ఈ ప్రయత్నం.
9.5.2008న రాత్రి 10.30 గంటల సమయం, స్థలం : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాదు.
ఇద్దరు విదేశీ అథిదులతో రెండవ ప్లోరులో నిలబడి వున్నాము. ఇద్దరూ సిగరెట్టువెలిగించి ఎదో మట్లాడుకుంటున్నారు. ఒక కుర్రాడు మాదగ్గరికి వచ్చి ఒక సిగరెట్టు ఇస్తారా ప్లీజ్.. అంటూ అడగటం మొదలెట్టాడు. వారికి ఏమి అనాలో అర్థం కాక నా వైపు తిరిగి చూసారు. సిగెరెట్టు అడుగుతున్నాడనిచెప్పాను. అంతలో కుర్రాడే చెప్పడం మొదలు పెట్టాడు. సార్ గటనుంది సిగరెట్టుదుకాణం(షాప్) కోసం వెదకుతున్నాను, ఎక్కడా కనబడలేదు, నాలుక పీకేస్తుంది అందుకనే అడిగాను అన్నాడు.
వాళ్ళు( అథిదులు అతనికి సిగరెట్టు ఇచ్చారు.)
11.5.2008 ఆదివారము రాత్రి : 11 గంటల సమయం స్థలం : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
కౌలాలంపూర్ నుంచి రావలసిన విమానానికి ఇంకా సమయం వుండటంతో అథిది సిగరెట్టు కాలుస్తూ బయట తిరుగుతున్నాము. అంతలో 35-40 సంవత్సరాల మద్య వయస్సున్న వ్యక్తి వచ్చి అగ్గిపెట్టెవుందా అని అడిగాడు. జేబులోంచి తీసి ఇస్తూ అదోలా నావంక చూసాడు. నాకేమీ అర్థం కాలేదు. అగ్గిపెట్టి ఆదిగిన తను తన సిగరెట్టు వెలిగించుకొని, అగ్గిపెట్తె ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత నన్ను అడిగాడు.
సిగరెట్టు కాల్చే అలవాటు అవసరం తెలిసినప్పుడు దగ్గర పెట్టుకోవాలని తెలియదా?
విచారమైన వింతమొఖం పెట్టి విదేసీయులను అడగాలని ఎలా అనిపిస్తుంది ... అని నన్ను అడిగాడు.
నిజానికి నాదగ్గర ఏ జవాబు దొరకలేదు.
అలావాట్లను నియంత్రించుకోలేమా అని నాకు అనుమానం కలిగింది
----
2916
6 comments:
meeru chala manchi vishayam drustiki teesukocharu. We take so many things for granted. Andulo idi okati
కొన్ని గాడిదలంతే అవి అలాగే ప్రవర్తిస్తాయ్.
ఒక సారి ఫ్రెండ్సందరం కలిసి కేరళ వెళ్ళాం. అక్కడకి వాళ్ళ అద్రుష్టం బాగోక కొందరు విదేశీయులు కూడా వచ్చార్. వాళ్ళ ముందు మనవాళ్ళ వెకిలి చేష్టలు చూసి మాకు సిగ్గేసింది.
కౌముది
మన అలవాట్లను నియంత్రిచుకోవచ్చు, కానీ యాదాలాపంగా ప్రవర్తిస్తుంటాము. ఒక్కోసారి అవి మన సంస్కృతిగా ప్రతిబింబిచవచ్చు. ముఖ్యంగా విదేశీయుల మద్య.
మీ స్పందనకు నెనరులు
indianminerva
అయ్యా !
నేను మాట్లాడింది గాడిదలను గురించి కాదు
గాడిదలాంటి మన ప్రవర్తన గురించి గమనించగలరు
మీ స్పందనకు నెనరులు
సిగరెట్ కాల్చాలన్న తపన వున్నప్పుడు, కొత్తవారితో మాట్లాడుతున్నామా లేక పాతవారితోనా, వారు భారతీయులా లేక విదేశీయులా అన్న భేద భావం వుండదు.సిగరెట్ beg చేయటమూ తప్పని పించదు. దమ్ము పీల్చాలన్న urge అలా చేయిస్తుంది. ఇదీ, సిగరెట్ తాగేవారి మానసిక స్థితి. ధూమ్రపానం ఆరోగ్యానికి హానికరం.
వాడు విదేశీయుడైన స్వదేశీయుడైన మాకు అగ్గిపెట్టె సిగరేట్ట్ వుండటమే కావాలి
Post a Comment