Sunday, May 4, 2008
నేనెందుకు బ్లాగాలి???
బ్లాగుల్లో ఎందుకు రాయాలి?
బ్లాగుల నిర్దిష్ట లక్యం ఏమిటి?
బ్లాగుల్ని ఎవరు చదువుతారు?
చదివేవారు రాసేవారి భావజాలానికి, ఆలోచనకీ సమీపంగా వుంటారా??
బ్లాగులు రాయటం స్వలాభమా? సాంకేతిక లాభమా?? తెలుగుకు లాభమా???
బ్లాగులు కాలక్షేప రచనలా?
బ్లాగులు సమచార భాండాగారాలా???
బ్లాగులు సాహిత్య నిలయాలా???
అయినా రాస్తున్న బ్లాగ్రాతలను అభినందించే వాళ్ళాకోసం ఎదురుచూపులమద్య హటాత్తుగా దుమ్మురేపుకుంటూ దూసుకువచ్చి అభిప్రాయ భాణాలను వదిలే పేరే చెప్పలేని వాళ్ళను ఎలా ఎదుర్కోవాలి?
ఒక్కోసారి మన ప్రక్కనవున్నవారే మన రాతాల సౌరభాన్ని ఆస్వాదిస్తున్నారో లేదోనని సందిగ్దాలనడుము ఏమి రాయాలి అనే మీమాంస.
మరోసారి అదేపనిగా పొంగుకొచ్చేభావాలను రాతల్లోకి మార్చి బ్లాగులు నింపితే విసుగుచెంది ఇటువైపే చూడని బ్లాగ్వీక్షకులు.
ఎప్పుడైనా పదుగురు కూడి మాట్లాడుకొనేటప్పుడు మాటవరసకైనా ఎవరిని గురించి మాట్లాడితే ఏమౌతుందొనని భయం.
నాలుగక్షారలు పేర్చి నలుగురుకూ కనపడేచోట అతికించాలంటే నావాళ్ళే గుర్తుకొస్తారు.
ఇలా ఎన్నో ఆలోచనలు మనసును తొలుస్తూనే వున్నాయి.
అయినా ఏదో నా మనసుకు నచ్చింది రాస్తూనే వుంటాను.
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
అక్షర దోషాలు.......
హఠాత్తుగా..
బాణాలు...
సందిగ్ధా
...
ఏమౌతుందో...
బ్లాగుల విషయంలో మీ ప్రశ్నలకు సమాధానం నా బ్లాగు రాతలు-కోతలు లో పత్రికలు-బ్లాగులు-రచయితలు లో దొరుకుతాయి.బ్లాగు అనేది ఒకరకంగా స్వేచ్చా భావ వ్యక్తీకరణ మాధ్యమం.మీ భావలను ఎటువంటి సంపాదక అడ్డంకులు లేకుండా,ఆక్షేపణ,దూషణలకు ఆస్కారం లేకుండా బ్లాగు ద్వార పదిమంది తో పంచుకోవచ్చు.వారి స్పందనలను తెలుసుకోవచ్చు.బ్లాగులను బహిరంగ డయిరీలని అనవచ్చు.డయిరీ ఎందుకు రాస్తామో అందరికీ తెలుసుగా!
కొన్ని సార్లు...ప్రశ్నకు.... ప్రశ్న సమాధానం అంటారు కదా...అలాంటిదే...రాస్తున్నాను ఇక్కడ...
దురద పుడితే ఏంచేస్తారు... ??
దురద పుట్టేచోటు అందక పోతే ఏంచేస్తారు...??
దురద బాగా ఎక్కువయి.. ఇలాంటి దురద ఎవరికన్నా పుట్టిందా అని తెలుసుకోవాలి అంటే ..తక్షణ కర్తవ్యం ఏమిటి...??
మీరు ఖాళిగా వున్నప్పుడు..ఆ దురద గురించి గుర్తొస్తే.... ఏంచేస్తారు...??
వీటికి సమాధానం చెప్పండి...నేను మీరు అడిగిన వాటికి ఇట్టే చెప్పేస్తాను...
కొన్ని సార్లు...ప్రశ్నకు.... ప్రశ్న సమాధానం అంటారు కదా...అలాంటిదే...రాస్తున్నాను ఇక్కడ...
దురద పుడితే ఏంచేస్తారు... ??
దురద పుట్టేచోటు అందక పోతే ఏంచేస్తారు...??
దురద బాగా ఎక్కువయి.. ఇలాంటి దురద ఎవరికన్నా పుట్టిందా అని తెలుసుకోవాలి అంటే ..తక్షణ కర్తవ్యం ఏమిటి...??
మీరు ఖాళిగా వున్నప్పుడు..ఆ దురద గురించి గుర్తొస్తే.... ఏంచేస్తారు...??
వీటికి సమాధానం చెప్పండి...నేను మీరు అడిగిన వాటికి ఇట్టే చెప్పేస్తాను...
దాదాపు రెండువేల పైచిలుకు అతధులు, దాదాపు వందవరకూ పోస్టులూ, ఒక సంవత్సరం బ్లాగ్వయస్సున్న ఒక బ్లాగర్ ఇప్పుడు "నేనందుకు బ్లాగాలి" అంటే అర్థం ఏమిటో? ఏమీతెలియదనుకోవడం లేదు కానీ ఇది నిరాశా? నిస్ప్రుహా? లేక నిర్వేదమా? ఇప్పటిదాకా చేసిన టపాల ద్వారా మీకేమైనా అసౌకర్యం కలిగుంటే తెలపండి సాటి బ్లాగర్లు చేయగలిగిన సాయం చేస్తారు.
బ్లాగ్ దేనిమీద, ఎలా, ఎందుకోసం వ్రాసినా చదివేవారుంటేనే రాసేవాళ్ళకికూడా ఒక కిక్. అయితే చదివినవాళ్ళంతా తమ అభిప్రాయాలను తెలుపాలనిలేదు. ఎనానిమస్ అభిప్రాయాలు మీకు నచ్చకపోతే వాటిని తొలగించండి. మీ బ్లాగులని ఎంతమంది, ఏఏ ప్రాంతాలనుండి చదువుతున్నారో తెలుసుకోవడానికి మీ స్టాట్ కౌంటర్ అనాలసిస్ ని చూస్తుండండి.
@ నరహరి
అక్షరదోషాలు చూపినందుకు,
ఇంకేదైనా వెతుకుతారేమో అనుకుంటే అక్ష్రదోషాలన్నా వెదికారు.
ఇంకా నా వేళ్ళు తెలుగు టైపుకు అలవాటు పడలేదు.
నెనరులు
@ కస్తూరి మురళీకృష్ణ
ఊరినిండా పాలుదొరుకుతుంటే బర్రెను మేపడమెందుకు అనే సామెత గుర్తొచ్చింది.
బ్లాగులు స్వేచ్చే అయినా చూసేవాళ్ళు ఉండాలిగా.
ఎంతకాలం దాసుకున్నా డైరీలా వుండాలి???
chandramouli
అయ్యా!
మీరన్నట్టు నాకు ఏరకమైన దురదా లేదు.
నాకు కాలక్షేపమూ కాదు. ఊసుపోక, ఆఫీసులో నెట్టు ఫ్రీగాదొరికి నేను బ్లాగడంలేదు.
బ్లాగడమే కాక ఇతర వ్యాపకాలు నాకున్నాయి.
chaks
I have to learn more about stat check
thanks
ఆఖరిపదం గమనించినట్టులేరు
Post a Comment