Tuesday, March 11, 2008

కలయేనా ???

హఠాత్తుగా
కళ్లు తెరవగానే
కల చెదరిపోయినట్లు
చేయిజారిన అద్దం
భళ్లున పగిలినట్లు
దశాబ్దాల వాస్తవం
కలలాగ కరిగిపోయింది
తీపిగురుతులు మాత్రం
జ్ఞాపకాల పొరలమధ్య నుంచి తొంగిచూస్తున్నాయి
మైదానలాలో
రెపరెప లాడిన త్రివర్ణ పతాకం
నేడు
నిర్జీవ నైరాశ్యాల మద్య
తలదించుకు నిలబడింది
మిత్రమా!
భారత జాతిరత్నమా!
ఎక్కడున్నది లోపం!
ఏమైపోతున్నదా ప్రతిభా పాటవం!
నిట్టూర్పుల సెగలేనా !!
ప్రతివోటమి వెనుక
గెలుపు మార్గమేదో దాగివుంటుంది.
ఒక్కసారి మరొక్కసారి అవలోకిద్దాం!
అవరోదించే కలుపుమొక్కలను పీకేద్దాం!
తలెత్తుకు తిరిగేలా జాతి కీర్తి దశదిశలా చాటుదాం!
(ఓటమి పాలైన హాకీ వార్తకు స్పందిస్తూ)

4 comments:

Anonymous said...

"దశాబ్దాల వాస్తవం
కలలాగ కరిగిపోయింది"

బాగు౦ది......

జాన్‌హైడ్ కనుమూరి said...

@ reddy gaaru ధన్యవాదములు

జాన్‌హైడ్ కనుమూరి said...

http://srividyab4u.blogspot.com/2008/03/blog-post_11.html

cadavaMDi

Srividya said...

మీ కవితా శైలి చాలా బావున్దన్డి. కొత్త బ్లాగర్లని ప్రోత్సహించాలనే, మీ ఉద్దేశ్యం నిజంగా అభినందనీయం.