సాధారణంగా చనిపోవుచున్నవారు చివరిసారి పలికిన మాటలకు విలువ, ప్రాముఖ్యత, మరణవాగ్మూలము గా పరిగణిస్తారు.
యేసుక్రీస్తు అప్పగింపబడినప్పటినుండి పలికిన మాటలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇవన్నీ (బైబిలు) పరిశుద్ధ గ్రంధమందు ఒకేచోట రాయబడలేదు. రాయబడ్డ సమయాలు కూడా వేరు వేరుగా కనిపిస్తాయి.
ఇతరులను గూర్చిన లక్ష్యము ఈ మాటల్లో కనిపిస్తుంది
1. తండ్రీ వీరేమిచేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము (లుకా 23:34) - శత్రువుల కొరకు ప్రార్థన.
2. నేడు నాతోకూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను (లుకా 23: 43) - పశ్చాత్తాప పడిన వారికి వాగ్దానము.
3. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను, శిష్యునితో యిదిగో నీ తల్లి యని చెప్పెను (యోహాను 19: 26-27) - విశ్వాసముతో వెంబడించువారికి ఆదరణ, భాద్యతలను గుర్తు చేస్తుంది.
వేదనను తెలియచేసివిగా
4. "ఏలీ ఏలీ లామా సబక్తా" బిగ్గరగా కేకవేసెను (మత్తయి 27:46)
ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తా బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా, నా దేవా నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము. (మార్కు 15: 34) - మనోవేదన మరియు దేవునికిని కుమారునికిని మద్య వున్న సంబధాలను గురించి చెపుతుంది
5. నేను దప్పిగొనుచున్నాననెను (యోహాను 19:28) - శారీరక వేదన - లేఖనములు, ప్రవక్తల ప్రవచన నెరవేర్పు కనిపిస్తుంది
విజయము :
6. సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. (యోహాను 19:30) - ముగిసెనను తృప్తి.
7. తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. (లూకా 23:46) - ప్రాణాత్మలను గురించిన తృప్తి.
ఇవి ద్యానము చేయుటద్వారా యేసుక్రీస్తు ఈ లోకమునకు మన పాపములకు బలియాగముగా చనిపోయెనని విశ్వసించుటద్వారా రక్షణ, పరిశుద్ధత, నిరీక్షణ ఇవ్వబడతాయి.
సమసమయాలలో తప్పిపోతున్న పరిస్తితులను, చేస్తున్న పాపములను ఒప్పుకొని మరియొకసారి నిర్ణయించుకోడానికి (రి డెడికేట్), సరిచేసుకోవడానికి ఇది సమయము.
2 comments:
మంచి విషయాలు రాశారు. ఇలాంటివి చాలా ఉపయోగ కరం-ముఖ్యంగా క్రైస్తవులకు!
Devuni ke Mahima.. Yesu nande rakhans kaladu.. Yessaya ne margam, Yese Satyam, Yese Jivam.
Post a Comment