Tuesday, March 11, 2008

నేను - బ్లాగర్ల సమావేశం

గత రెండు బ్లాగర్ల సమావేసాలు డుమ్మా కొట్టాటం జరిగింది ఏవో వ్యక్తిగత కారణాలవల్ల. ఈ సారి ఎలగైనా వెళ్ళాలని చలా రోజులనుంచే ప్రయత్నాలు. ఆదివారం ఉదయం నేను నా ప్రక్కటెముక (బెటర్ హాఫ్) కలిసి అద్దె ఇళ్ళ వేటకు బయలుదేరాము. ఒక ఇల్లుచూస్తున్న సమయంలో నా బాస్ నుంచి ఫోను. చెల్ ఇంటిలోనే వదిలేయాల్సింది అనిపించింది. అయిష్టంగానే పలరించాను, తోదరగా ఆఫీసుకు రమ్మని సారాంశం. నా ప్రక్కటెముకను ఆటో ఎక్కించి నేను ఆఫీసుకు బయలుదేరా( నా స్కూటరు పై). ఇక బ్లాగర్ల సమావేశం మళ్ళీ డుమ్మా అనుకున్నా. కాని పని 1.30 గం. అయిపోవటం వల్ల తొందరగానే బయటపడ్డాను.
3 గ. ప్రంతంలో బయలుదేరుతుండగా త్రివిక్రం వస్తున్నారా అని పలరింపు ఫోను. రామచద్రపురంనుండి బస్సుఎక్కాను కాని అది కుకట్పల్లి వరకే. కుకటపల్లినుండి 19 నెంబరు బస్సు దొరికింది.
పార్కు ఎదురుగానే దిగటం కొంత శ్రమను తగ్గించించింది.
ఇక సమవేశం గురించి :
సాంకేతికంగా మాటలు నాకు అర్థం కానప్పటికీ ఏమి జరుగుతుందో తెలుసుకొనే నిమిత్తం హాజరవుతున్నాను.
బ్లాగులగురించిన చర్చవిన్న తర్వాత నేను బ్లాగడంలోని దృక్పదాన్ని మార్చుకోవాలనుకున్నాను.

కొత్తవారి పరిచయాలు ఎప్పుడూ తాజాగానేవుంటాయి.

నేను ఎక్కడకి వెళ్ళినా, ఏ కార్యక్రమంలో పాలుపంచుకున్నా నా దృష్టి అంతా సాహిత్యంమీదనే వుంటుంది
నా బ్లాగులనే దానినుండి విభజించాలని అనుకున్నాను.
నా ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాలి.
కశ్యప్
చావా కిరణ్ వసంతకుమార్ జాన్ హైడ్ కనుమూరి తుమ్మల శిరీష్ సీతారామ శాస్త్రి కే.బి.యల్ శర్మ కే.యస్.శ్రావ్య
సత్యసాయి శ్రీనివాసరాజు ధాట్ల సుధాకర్ వెంకటరమణ వీవెన్ త్రివిక్రం సి.బి.రావు పద్మనాభం దుర్వాసుల నరసింహారావు నువ్వుశెట్టి క్రిష్టకిషొర్ నందగిరి ప్రవీణ్ కట్టా vijay
dhanyavaadamulu

2 comments:

రాధిక said...

ప్రక్కటెముక....super.

జాన్‌హైడ్ కనుమూరి said...

@ రాధిక ధన్యవాదములు