Saturday, February 9, 2008

జ్ఞాపకాలు దేవాలయాలు

ఈ మద్య నా మిత్రుడొకడు వూరు వెళ్ళివస్తూ వస్తూ చీరాలలో ట్రాఫిక్ ఆగినప్పుడు ఓ గుడి గోపురాన్ని ఫోటో తీసుకొచ్చాడు. మీరుచూస్తున్నది అదే. ఆది ఏ దేవాలయమో నాకుగాని, అతనికి గాని తెలియదు. ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడల్లా నా అనుభవాలు రాయాలనిపిస్తుంది. చివరికి ఇప్పటికి తీరికదొరికింది.
నేను 1వ తరగతి నుండి 5 తరగతివరకు పట్టిసీమ - కొవ్వూరు (పశ్చిమ గోదావరి జిల్లా)మద్య జరిగింది. గోదావరీ తీరం వైషణవానికి ప్రసిద్దిచెందిన చరిత్ర వున్నప్పటికి వివిధ ఇతర దేవాలయాలు వుండాటాం విశేషమే అనిపిస్తుంది.పోలవరంలో నడీస్వరునికొండ, పాండు రంగడికొండ, రామలయము, పట్టిసీమలో గోదవరి నదిమద్యలోవున్న శివాలయం బహు ప్రసిద్ది చెందినదే. గూటాల ఆంజనేయుడి గుడి కొవ్వూరు వేణుగొపాల గుడి, గోవుపాదాలరేవు ఇలా కొన్ని.ద్వారకా తిరుమల(చిన్న తిరుపతి), హనుమాణ్ జంక్షన్(పెద్ద విగ్రహం) ఆంజనేయుడి గుడి, అమరావతిలో ద్యానంజనేయ విగ్రహం, పొన్నురులో నల్లరాతి అంజనేయుడి విగ్రహం, కోటిలింగాలు, అమరావతిలో శివాలయం, మంగలగిరిలో పానకాలస్వామి, బాసరలోని సరస్వతి ఏఅలయం, కృష్ణా, గుంటూరు జిల్లాలోని కొన్ని దేవాలయాల పేర్లు నాకు గుర్తుకు రావటంలేదు అద్భుత శిల్ప సంపద అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం, ఇలా నేను సందర్శించిన దేవాలయాలు జ్ఞాపకానికి వచ్చాయి.
ఇవేకాకమద్యప్రదేశ్‌లోని మయ్యర్ కొండ చాలా ఎత్తుగాను, ఏటవాలుగాను వుండే క్షేత్రం ఆ ప్రాంతంలో సుప్రసిద్దమైనదే. బదరీనాద్ వెళ్ళినప్పుడు హోరున వర్షం మరచిపోలేనిది.ఆగ్రా ఢిల్లీల మద్యవున్న మథురై కృష్ణుడి దేవాలయానికి వెళ్ళినప్పుడు పోగొట్టుకున్న స్వెట్టరు అప్పుడప్పుడు నా ఆల్బంలోని ఫొటొలలో కనిపించి గుర్తుచేస్తుంది. డిల్లీలోని బిర్లా దేవాలయంలో అద్దాలమద్య వున్న కృష్ణుడు, లక్స్మీనారయణ దేవాలయంలో కనిపించే పాలరాతి కట్టడాలు అప్పుడప్పుడూ అనంతమైన సంస్కృతిని గుర్తుచేస్తునేవున్నాయి.

2 comments:

కొత్త పాళీ said...

బాగుంది జాన్‌గారూ. ఒక చిన్నసవరణ. ఆగ్రా దగ్గిర యమునా తీరాన కృష్ణుని బాల్యం గడిచిందని పురాణాలు చెబుతున్న క్షేత్రం మధుర. తమిలనాడులో వైగై నదీతీరాన మీనాక్షీ ఆలయానికి నెలవైన చారిత్రక పాండ్య రాజధాని మదురై.

జాన్‌హైడ్ కనుమూరి said...

Thanks for correction