Saturday, January 19, 2008

మేఘం నీలి మేఘం - పాట


మేఘం నీలి మేఘం
రంగుల హరివిల్లుకై
చినుకులిచ్చిన మేఘం

వింజామరలా చిరుగాలి స్పర్శతో
యెదలోదాచిన వూసులకు
వూతమిచ్చి రేకులు తొడిగి
తూనిగలై తారాడగా
తుంపరలనిచ్చిన మేఘం

చినుకు చినుకులా రాలి
మనసులో ముడుచుకున్న
భావాలు రాగాలుగా చేసి
కమ్మనిగీతాలై నే పాడగా
తనువునే తడిపిన మేఘం

కానరాని చెలియ చూపులు
తరిమి తరిమి వెదకుతుంటే
రెప్పల మాటునున్న కలలు
పురివిప్పి నాట్యమాడగా
పుకరింపచేసిన మేఘం

2 comments:

Anonymous said...

ఇలాంటి చెత్త కవితలు రాసి మీ నిజమైన టాలెంట్ ని మరుగు పరుస్తున్నారు, యేదో రాయాలి కాబట్టి, లేదా ఫోటో కోసమో కాకుండా మీ నిజమైన ఆవేశంతో రాయండి గురూగారు!

జాన్‌హైడ్ కనుమూరి said...

నా మీద గౌరముంచిన శిష్యుడా!
కొన్ని గమనించు :
1. నేనేదో నిరూపించాలని నేను బ్లాగు రాయటంలేదు
2. ఎవరికో అందించాలనీ రాయటంలేదు
3. నేను మద్యపాన వ్యసనాన్నుండి బయటపడటానికి కవిత్వాన్ని స్వీకరించాను.
4. మళ్ళీ వెనుకకు తిరగకూడదనేదే నా ప్రయత్నం.
5. నన్ను నేను సమతుల్యంగా వుంచుకోవడానికి ప్రయత్నించుకుంటాను, అది మీకు చెత్త అనిపిస్తే నేను ఏమీ చెయ్యలేను.