పల్లకిలో ఊరేగింపు
తొలి సిగ్గుల మేళవింపు
కళ్ళలో ఇంద్రధనస్సు
మేనిలో కొత్త సొగసు
ఒహోం ఒహోం హోయ్
ఫీజర్లో బద్రమైన ఊహలు
గీజర్లో కాగుతున్న ఆశలు
గులాబీల పరిమళాలై
ముందునడుస్తూ మున్ముందుకు నడుస్తూ
ఒహోం ఒహోం హోయ్
కలలే ఓ చిగురాకు
పండిన గోరింటాకు
నున్నని బుగ్గలపై చేరి
మెరిసి మురిపిస్తూ మైమరిపిస్తూ
ఒహోం ఒహోం హోయ్
గుసగుసలాడే ఆశల ఊసులు
బుస బుస పొంగే కొరికల తూపులు
రాగాలై సరాగాల మేళాలై
వీధుల్లో వినువీధుల్లో ఆలపిస్తూ
ఒహోం ఒహోం హోయ్
(నా చిన్నతనంలో పెళ్ళివూరేగింపు అనగానే పల్లకి, పల్లకీ అలంకరణ, బోయీల లయ, మరచిపోలేని జ్ఞాపకాలు. జ్ఞాపకాలనుంచి నాలుగు పదాలు)
2 comments:
కళ్ళలో ఇంద్ర ధనుస్సు ’ అన్న పదం తప్ప ఏముంది బాబియ్య ఈ రచనలో. ఇలాంటి పాటలు నిరుపయోగం. ఆ..ఆ.. ఏదైనా తెలుగు ధారావాహికకు శీర్షికగీతంలా పనికి రావచ్చు.
ఇందులో ఏముందో
మీరేమి ఆశిస్తున్నారో
ఈ మద్య రాసినవికాదు
అయినా కాకిపిల్ల కాకికిముద్దన్నట్టు
నా రాతలు నాకు ముద్దే
అంతే కాదు మిత్రమా
మీ రాతలు నాకు ముద్దే
Post a Comment