Wednesday, January 9, 2008

ఎదురుచూపుల తలపులు


ఎదురుచూసా ప్రతిక్షణం
వూహలవేగంతో ఎగిరొస్తావని
కనులలో కదిలే
కలలకే రూపం యిస్తావని

విడివడిపోయిన ముంగురులు
పడిగాపుల చూపులు
విసిగి వేసారి
నిట్టూర్పుల సెగలైపోవగ

ముంగురులనే సవరించ
మోముపై కదలాడిన వేలికొనలు
గిలిగింతలై నడయాడేనని
ఎదురుచూసా

సతమతమయ్యే పనులు
మది కలచే గిరులు
నిలచి కలచి కుతకుతలాడగ
కదులుతుంటే

వూతమిచ్చే మోతాదుగా
చెవిలో పలికే పలుకులై
మూటల ధైర్యమయ్యేనని
ఎదురుచూసా

1 comment:

GKK said...

నిరర్థకం. నిస్సారం. కవితాత్మకత శూన్యం ఈ రచనలో. హైడ్ బాబియ్యా. సారీ.