Wednesday, October 10, 2007

నేను కొద్దిసేపు "గ్లాడియేటర్" నయ్యాను

మా ప్రక్క గదులులో వున్నవాళ్ళు ఖాళీ చేసారు ఈ మద్య. వాళ్ళు ఖాళీ చేస్తున్నప్పుడు ఎలుక ఒకటి మాయింటిలోకి వచ్చినట్టు నా భర్య గమనించి నాతో చెప్పింది. పొనీలే అదే వెళ్ళిపోతుంది అని నిర్లక్షంచేసాను. ఒకరోజు నేను ఎప్పటినుంచో దాచుకున్న ఉత్తరాలమద్య దూరి ముక్కలు ముక్కలుగా కొట్టివేసింది. అందులో కొంతమంది ప్రముఖులు రాసిన వుత్తరాలు కూడా వున్నాయి. చాలా బాధవేసింది. ఏదైనా చెయ్యాలని అనిపించింది. ఇలానే వదిలేస్తే మిగిలినవి కూడా నాకు దక్కకుండా పోతాయనిపించింది. వెంటనే దానికోసం వెదకటం మొదలుపెట్టాను. నాకు ఆయాసం, వంటినిండా చెమట పట్టింది తప్ప ఎలుక చేతికి చిక్కలేదు, అలాగని బయటికి పోలేదు.

మరసటిరోజు "గ్లాడియేటర్" సినిమా చూస్తున్నాను అందులో ఒక సీనులో హీరో పోరాడుతూవున్నప్పుడు ప్రత్యర్థిని కత్తితో పొడుస్తాడు। వెంటనే ప్రక్కన ఇంకొ కత్తి కనిపిస్తుంది ఏ మాత్రం ఆలస్యంచేయకుండా రెండో కత్తిని చేతపట్టి ప్రత్యర్థిపై కత్తెరతో కత్తిరించినట్టు కత్తిని వాడతాడు. అదిచూడగానే నాకు జ్ఞానోదయం అయినట్లు అనిపించింది. వెంటనే సినిమా ఆపుచేసి ఎలుకపై దాడికి దిగాను. రెండు గంటల ప్రయత్నం తర్వాత చేతికిచిక్కింది.

నేను కొద్దిసేపు "గ్లాడియేటర్" నయ్యాను నా సమస్య వలన.

5 comments:

రాధిక said...

అయ్యో ఉత్తరాలను పోగొట్టుకున్నారా?నాకే చాలా బాధ గా వుంది ఈ మాట వింటుంటే.

Solarflare said...

"నా సమస్య నుండి" కాదు - "నా సమస్య వలన". అలానే కాళీ కాదు ఖాళీ.
ఏమనుకోకండీ - ఉండబట్టలేక చెప్పాను.

జాన్‌హైడ్ కనుమూరి said...

ఉత్తరాలు ఎలాగూ పోయాయని బాధలోంచి గ్లాడియేటర్ అవ్వడం కొంత వూరట కలిగించింది.

అలసిపోయానని వదిలివేస్తే ఇంకొన్ని పోగొట్టుకొనేవాణ్ణి కదా!

స్పందించినందుకు నెనరులు

Solarflare said...

ఎవరైనా థాంక్స్ చెపితే - మామూలుగా "You'r welcome" అంటాము - మరి దీనికి తెలుగులో ఏమనాలో - అందుకని తెలుగులో ఏమనాలో నాకు తెలిసేవరకు ఇంగ్లీష్ లో- You are welcome

Anonymous said...

Kastamenandi elakalatho
avi nannoo edipinchaai